Sanjiv Khanna | సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం..

-

భారతదేశ 51వ చీఫ్ జస్టిస్‌గా సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారంతో డీవై చంద్రచూడ్(DY Chandrachud) పదవీకాలం పూర్తి కావడంతో సోమవారం సంజీవ్ ఖన్నా.. సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో సంజీవ్ ఖన్నా ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar), ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జుమ్ రామ్ మేఘ్వాల్ సహా తదితరులు హాజరయ్యారు. సంజీవ్ ఖన్నా పదవీ కాలం 13 మే 2025 వరకు కొనసాగనుంది.

- Advertisement -

2019లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna).. ఈ ఆరేళ్ల సమయంలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యునిగా ఉన్నారు. ఈవీఎంల నిబద్దతపై కూడా కీలక తీర్పును వెలువరిచారు. ఎన్నికల బాండ్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ ఇటువంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో సంజీవ్ కూడా భాగస్వామిగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు.

Read Also:  రోహిత్‌కు రాహుల్, బుమ్రాలే రీప్లేస్‌మెంట్: గంభీర్

Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...