Ranya Rao | ప్రకంపనలు సృష్టిస్తోన్న నటి రన్యా రావు స్మగ్లింగ్ కేసు

-

బంగారు స్మగ్లింగ్ ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు కుమార్తె, కన్నడ నటి రన్యా రావు(Ranya Rao) అరెస్టు కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు దారితీసింది. ఈ విషయంపై సీఎం సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు అవసరం అని అన్నారు.

- Advertisement -

కాగా, సోమవారం రాత్రి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తుండగా రన్యా రావు అరెస్టు అయ్యారు. అనంతరం ఆమెను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యాయ సలహాదారు, ఎమ్మెల్యే ఎ.ఎస్. పొన్నన్న బుధవారం బెంగళూరులో మాట్లాడుతూ.. “నిందితురాలు డిజిపి కుమార్తె కావడం యాదృచ్ఛికం. ఇప్పుడు, ఆమె స్మగ్లింగ్ కేసులో నిందితురాలు, చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఆమె ఒక సామాన్యుడి కుమార్తెనా, డిజిపి కుమార్తెనా లేదా ప్రధానమంత్రినా అనేది పట్టింపు లేదు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది” అని అన్నారు.

మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.డి. రంగనాథ్ తన మాట్లాడుతూ.. “బంగారం స్మగ్లింగ్ గురించి మేము చాలా వింటున్నాము. ఆశ్చర్యకరంగా, సంపన్న కుటుంబాలు ఇటువంటి కార్యకలాపాలలో పాల్గొంటున్నాయి. ధనిక నేపథ్యం నుండి వచ్చి ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం దురదృష్టకరం” అని ఆందోళన వ్యక్తం చేశారు.

బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఈ కేసులో లోతైన దర్యాప్తు అవసరం ఉందన్నారు. “దీనిని తేలికగా తీసుకోలేము. ఆమె ఎవరి కుమార్తె అయినా, ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి సమగ్ర దర్యాప్తు అవసరం. చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలి” అని ఆయన నొక్కి చెప్పారు.

రన్యా రావు(Ranya Rao) అరెస్టు తర్వాత, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బుధవారం బెంగళూరులోని లావెల్లె రోడ్‌ లోని ఆమె ఉన్నత స్థాయి నివాసంపై రైడ్స్ చేసింది. అధికారులు అపార్ట్‌మెంట్ నుండి రూ.2.06 కోట్ల విలువైన బంగారం, రూ.2.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆమె నెలవారీ అద్దె రూ.4.5 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.

దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 32 ఏళ్ల నటి రన్యా రావు సోమవారం రాత్రి దుబాయ్ నుండి ఎమిరేట్స్ విమానంలో వచ్చిన ఆమెను బెంగుళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నిఘా సమాచారం ప్రకారం, నలుగురు DRI అధికారుల బృందం ఆమెను విమానాశ్రయంలో అడ్డుకుంది. ఆమె 15 రోజుల్లో దుబాయ్‌కు నాలుగు ట్రిప్పులు చేసిందని, దీంతో అనుమానాలు అధికారులకు ఆమెపై అనుమానం కలిగింది.

రన్యా రావు తన బెల్ట్, దుస్తులలో బంగారు కడ్డీలను దాచిపెట్టి, తన తండ్రి స్థానాన్ని ఉపయోగించి గుర్తించకుండా తప్పించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కస్టమ్స్ అధికారుల నుండి తప్పించుకునేందుకు ఆమె విమానం దిగిన తర్వాత పోలీసు సిబ్బందిని పిలిపించేదని, వారు ఆమెను ఇంటికి తీసుకెళ్లేవారని అధికారులు వెల్లడించారు.

పోలీసు సిబ్బంది లేదా ఆమెతో సంబంధం ఉన్న ఏదైనా IPS అధికారి స్మగ్లింగ్ రాకెట్టులో భాగస్వాములు అయ్యారా లేదా ఆమె ఒంటరిగా వ్యవహరించారా అని అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతంలో బంగారం అక్రమ రవాణా చేసిందా అని కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

రన్యా రావును అరెస్టు చేసిన తర్వాత, ఆమెను బెంగళూరులోని DRI ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

‘మాణిక్య’లో కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ సరసన నటించిన రన్యా రావు, ఇతర దక్షిణ భారత చిత్రాలలో కూడా పనిచేశారు. ఆమె తండ్రి, డిజిపి రామచంద్రరావు(DGP Ramachandra Rao), నాలుగు నెలల క్రితం ఆమె వివాహం జరిగినప్పటి నుండి తనకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఈ కేసు నుండి దూరంగా ఉన్నారు.

Read Also: మహిళల ఉపాధి కోసం ర్యాపిడోతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Champions Trophy | సౌత్ఆఫ్రికాపై కివీస్ ఘన విజయం

ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది....

Rahul Gandhi | రాహుల్‌కి రూ.200 ఫైన్.. ఆ వ్యాఖ్యలే కారణం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్‌ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది....