వివాదాస్పద జ్ఞానవాపి(Gyanvapi), షాహీ ఈద్గా(Shahi Idgah) నిర్మాణాన్ని ముస్లింలు హిందువులకు అప్పగించండి. వీటితో ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. మాజీ ASI (ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా) రీజనల్ డైరెక్టర్ కేకే మహ్మద్(KK Muhammed). 1976లో బీబీ లాల్ నేతృత్వంలో బాబ్రీ మసీదు కింద తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ బృందంలో ఈయన కూడా ఒకరు. మసీదుకు పశ్చిమ భాగంలో హిందూ దేవతల ఆనవాళ్లు ఉన్నాయని వీరు చెప్పినప్పటికీ.. ఎవరూ నమ్మలేదు.
2019 లో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తమ పరిశోధన నిజమైందని, అక్కడ రామ మందిరం ఉందని.. ముస్లిం అయినప్పటికీ మొహమ్మద్(KK Muhammed) సత్యం గెలిచిందని సంతోషించారు. కాగా, రామజన్మభూమికి సంబంధించి 12 స్తంభాలతోపాటు హిందూ దేవాలయాలను పోలిన శాసనాలు ఉన్నాయని కేకే మొహమ్మద్ కీలక పరిశోధనలు చేశారు. అలాగే కాశీ, మధుర, అయోధ్య హిందువులకు చాలా ప్రత్యేకం అని ఆయన అన్నారు. ఇక్కడ మసీదులు నిర్మించిన ప్రదేశాల పట్ల ముస్లింలకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవన్నారు. ఈ ప్రదేశాల్లో హిందూ దేవతల ఆనవాళ్లు ఉన్నాయని, అవి వారికి అప్పజెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: చైనాలో తీవ్ర విషాదం.. 47 మంది సజీవ సమాధి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat