దేశాన్ని కుదిపేస్తోన్న కోల్కతా హత్యాచార కేసు(Kolkata Doctor Case) సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(Sanjay Rai) శరీరంపై గాట్లు.. కుడి, ఎడమ మోచేయితో పాటు తుంటిపై గాయాలున్నట్లు సీబీఐ గుర్తించింది. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించిందనడానికి ఇవి సంకేతాలని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. హత్యాచార సమయంలోనే నిందితుడికి గాయాలైనట్లు అనుమానిస్తోంది. గాయాలపై ప్రశ్నించినప్పుడు నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ అధికారులకు సమాధానం చెప్పలేదని వెల్లడవుతోంది.