Kolkata Doctor Rape | కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం దేశమంతా సంచలనం సృష్టించింది. సదరు ట్రైనీ డాక్టర్ న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు నిరసనలు తెలిపారు. ఈ ఘటనపై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్న క్రమంలో ప్రథమంగా ఈ కేసు దర్యాప్తు కోల్‌కతా పోలీసులు హ్యాండిల్ చేశారు. వారి పనితీరుపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు రావడంతో ఈ కేసు కాస్తా సీబీఐ చేతికి వెళ్లింది. ఈ కేసులో టేకోవర్ చేయడమైతే సీబీఐ చేసింది కానీ. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ సాధించలేదు. ఇప్పటికి కూడా అది సాముహిక హత్యాచారమా, ఒక్కరు చేసిన పనేనా అన్న విషయంలో స్పష్టత లేదు. నిందితులను అదుపులోకి తీసుకునే విషయంలో కూడా అనేక లోటుపాట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు సీబీఐకి సవాల్‌గా మారింది. ఈ విషయాన్ని సీబీఐ అధికారి ఒకరు అంగీకరించారు కూడా.
Kolkata Doctor Rape | నేరం జరిగిన ప్రాంతంలో తగిన ఆధారాలు లభించలేదని, దాని కారణంగా దర్యాప్తు ఆలస్యం అవుతోందని అన్నారు. ఆధారాలు, సాక్ష్యాల లేమి ప్రభావం దర్యాప్తుపై తీవ్రంగా ఉందని, అనుమానితులను విచారించాలన్నా సరే ఆధారం ఏమీ లేకపోవడంతో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. డాక్టర్ మృతదేహం దొరికిన మరుసటి రోజు సెమినార్ హాల్ సమీపంలోని రెస్ట్‌రూం, టాయిలెట్‌ను కూల్చివేయాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆదేశించారని గుర్తించామని, అందుకు గల కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వెలలడించారు. అంతేకాకుండా ఆ మరమ్మతు పనులు ప్రారంభించిన క్రమంలోనే కీలక ఆధారాలు మిస్ అయ్యాయన్న అనుమానాన్ని కూడా సదరు అధికారి వ్యక్తం చేశారు. కానీ బాధితులకు న్యాయం లభించేలా పనిచేస్తున్నామని అన్నారు.