లా కమిషన్ నయా ఫార్ములా.. 2029 నుంచి జమిలి ఎన్నికలు!!

-

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే, లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు(One Nation One Election) నిర్వహించడం 2024లో సాధ్యంకాదని లా కమిషన్ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో 2023 నుంచి దీనిని అమలుపరిచేందుకు ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి వ్యక్తం అవుతోంది. లోక్ సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే జమిలి ఎన్నికలపై కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణనూ తన ఫార్ములాలో ఇమిడేలా చేయాల్సిందిగా లా కమిషనన్ ను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం తొలుత అప్పగించిన బాధ్యత.. లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల(One Nation One Election) నిర్వహణకు సంబంధించి లా కమిషన్ నివేదిక వివిధ కారణాల వల్ల ఇంకా రెడీ కాలేదని సమాచారం. 2029లో దీనిని సాధ్యంచేసేందుకు గాను శాసనసభల గడువులను సర్దుబాటు చేయటానికి జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని ప్రస్తుత లా కమిషన్ కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జత చేయాల్సి వస్తే… తొలిదశలో లోక్ సభ, అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని, రెండో దశలో స్థానిక సంస్థల (పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్) ఎన్నికలు జరపాలని సూచించే అవకాశం ఉంది.

ఈ రెండు దశలనూ ఒక ఏడాదిలోనే నిర్వ హించాలని నిర్దేశించవచ్చు. దేశంలోని వివిధ వాతావరణ పరిస్థితులు, ఆచరణాత్మక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ విధమైన సూచనను లా కమిషన్(Law Commission) చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే మూడు అంచెల ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితా రూపొందించడానికి గాను లా కమిషన్ విధివిధానాలను రూపొందిస్తుంది. ఉమ్మడి ఓటర్ల జాబితా వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఒకే రకమైన పని కోసం మళ్లీ మళ్లీ మానవ వనరులను వినియోగించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు తప్పుతుంది.

Read Also: భార్యాభర్తల మధ్య ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...