ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తీసివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో భారత దిగ్గజ కంపెనీ రిలయన్స్ కు చెందిన జియో మార్ట్(Jio Mart) కూడా చేరింది. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అయిన జియో మార్ట్ 1,000 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మరో 9,900 మంది ఉద్యోగులనూ తొలగించనుంది. కార్పొరేట్ కార్యాయలంలో 500 మంది, క్షేత్రస్థాయిలో మరో 500 మందిని రాజీనామా చేయాలని జియో మార్ట్ కోరినట్టు ఎకనమిక్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
లాభాలు పెంచుకునేందుకు జియోమార్ట్(Jio Mart) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపింది. ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవడంపై సంస్థ దృష్టి సారించిందని పేర్కొంది. ఇందులో భాగంగా సగం ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాలను మూసివేయనుందని చెప్పింది. రిలయన్స్ రిటైల్ ఇటీవలే 344 మిలియన్ డాలర్లతో మెట్రో ఏజీ హోల్ సేల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. తాజా సంస్కరణల వెనుక ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోందని వెల్లడించింది.
Read Also: సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల
Follow us on: Google News, Koo, Twitter