Yogi Adityanath | ‘యోగి ఆదిత్యనాథ్‌ను అంతం చేస్తాం’.. పోలీసులకు బెదిరింపులు

-

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath)ను హతమారుస్తామంటూ ముంబై పోలీసులకు ఓ బెదిరింపు సందేశం వచ్చింది. పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి యోగి రాజీనామా చేయాలని, లేకపోతే ఆయన్ను హతమారుస్తామని బెదిరింపు సందేశంలో ఉంది. ‘‘యోగి ఆదిత్యనాథ్‌ తన పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే బాబా సిద్ధిఖీ(Baba Siddique)ని హతమార్చినట్లే యూపీ సీఎంను కూడా సఫా చేసేస్తాం’’ అని దుండగులు తమ సందేశంలో పేర్కొన్నారు. కొన్ని రోజుల వరకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి(Yogi Adityanath)ని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం దేశమంతా సంచలనం రేపుతోంది.

- Advertisement -

ఈ పరిణామాన్ని తీవ్రంగా భావించిన పోలీసులు రంగంలోకి దిగి.. విచారణను వేగవంతం చేశారు. ఈ సందేశం ఫాతిమా ఖాన్ అనే మహిళ ఫోన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసిన ఆమె కొంతకాలంగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. థానేలోని ఉల్హాస్ నగర్‌కు చెందిన నిందితురాలి వయసు 24ఏళ్లు అని ఆమె తండ్రి టింబర్ బ్యాపారి అని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే అక్టోబర్ నెలలో మహారాష్ట్ర ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన బాబా సిద్దిఖీ అనే నేతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సభ్యులు కొందరు హతమార్చారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు సన్నిహితంగా ఉండటం వల్లే బాబా సిద్ధిఖీని చంపామని నిందితులు వివరించారు. ఆ తర్వాత పలువురికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సిద్ధిఖీ కుమారుడు జీశాన్ పేరు కూడా తమ లిస్ట్‌లో ఉందని నిందితులు చెప్పారు. ఇటీవల జీశాన్‌కు కూడా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.

Read Also: అల్లు అర్జున్‌తో చిందేసేది ఆ చిన్నదే.. పుష్ప 2 స్పెషల్ సాంగ్ అప్‌డేట్..
Follow Us On: Google News, Twitter, ShareChat

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...