LPG Price | ఇళ్లలో వాడే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర సర్కారు తగ్గించిన కొన్నిరోజుల్లోనే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా దిగొచ్చింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.158 మేర తగ్గించాయి. ఈ కొత్త ధర సెప్టెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. కమర్షియల్ సిలిండర్ రిటైల్ ధర హైదరాబాద్‌లో రూ.1,760కి, విజయవాడలో రూ.1,692.50కి చేరింది. ఈ నెలంతా ఇదే రేటు అమల్లో ఉంటుంది. ఆగస్టులోనూ కమర్షియల్ సిలిండర్ ధర 100 రూపాయలు చొప్పున తగ్గింది.
ఎల్పీజీ సిలిండర్ రేటు(LPG Price)ను ఆన్‌లైన్‌లో చెక్ చేయాలనుకుంటే ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడొచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.