Lucky Fellow saved while suicide attempting in Mantralaya at Maharashtra: ఏం కష్టం వచ్చిందో ఏమో.. జీవితంపై విరక్తితో ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించాడో వ్యక్తి. కానీ అతడికి ఇంకా భూమ్మీద నూకలున్నట్లున్నాయ్.. ఆరో అంతస్తు నుంచి దూకినా.. అతడికి ఏమీ కాలేదు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో జరిగింది. నగరంలోని ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న వ్యక్తి.. మహారాష్ట్ర హెడ్ ఆఫీసు మంత్రాలయ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. కానీ.. రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన, వలలో పడటంతో ప్రాణాలు నిలిచాయి.
చనిపోవాలనుకున్నా.. బతికేయటంతో ఆ వ్యక్తి పెద్దపెద్దగా అరచి గోల చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. అతడిని సేఫ్టీ నెట్ నుంచి బయటకు తీసుకువచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. కాగా, 2018లో ఫిబ్రవరిలో ఓ నలుగురు వ్యక్తులు మంత్రాలయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అక్కడ రక్షణ వల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిపాలనా భవనం చుట్టూ మధ్య దాదాపు పదివేల చదరపు అడుగుల ఖాళీ ప్రాంతంపై ఆనాటి ప్రభుత్వం రక్షణ వలను ఏర్పాటు చేసింది. మనోడి ప్రాణాలను ఆ నిర్ణయమే ఇప్పుడు కాపాడింది. ప్రస్తుతం ఈ ఆత్మహత్యాయత్నం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకా భూమ్మీద నీకు నూకలున్నాయ్ బ్రదర్ (Lucky Fellow) అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు