Online Gaming |అదృష్టం అంటే ఇదేనేమో. ఓ సాధారణ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. అది కూడా ఆన్ లైన్ గేమింగ్ యాప్ ద్వారా అంతమొత్తం సంపాదించాడు. మధ్యప్రదేశ్ లోని బర్వానీ జిల్లాకు చెందిన డ్రైవర్ షహబుద్దీన్ మన్సూరి ఆదివారం ఆన్ లైన్ గేమింగ్ యాప్ లో రూ.49 పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బుతో కోల్ కతా, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా జవర్చువల్ క్రికెట్ జట్టును సృష్టించాడు. అతను సృష్టించిన జట్టుకు మొదటి స్థానం వచ్చి రూ.1.5కోట్లు గెలుచుకున్నాడు. అతను గెలుచుకున్న రూ.1.5కోట్లలో రూ.20లక్షలు విత్ డ్రా చేయగా.. రూ.6లక్షలు పన్ను మినహాయింపు పోనూ రూ.14లక్షలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. గత రెండేళ్లుగా ఆన్ లైన్ గేమింగ్(Online Gaming) యాప్స్ లో క్రికెట్ జట్లను సృష్టిస్తున్నానని తెలిపాడు. ఈ డబ్బుతో అద్దె ఇంట్లో ఉంటున్న తాను సొంత ఇల్లు కట్టుకుంటానని షహబుద్దీన్ తెలిపాడు. మిగిలిన డబ్బుతో సొంతగా వ్యాపారం చేసుకుంటానని పేర్కొన్నాడు.
Read Also: ప్రియుడితో కలిసి శ్రీవారి సేవలో జాన్వీ కపూర్
Follow us on: Google News, Koo, Twitter