Manikrao Kokate | చీటింగ్ కేసులో మంత్రికి జైలు శిక్ష

-

మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకఠే‌కు(Manikrao Kokate) న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఓ చీటింగ్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. రెండేళ్ల జైలుతో పాటు రూ.50 వేల జరిమానా కూడా విధించింది. ఆయనతో పాటు ఆయన సోదరుడికి కూడా న్యాయస్థానం శిక్ష విధించింది. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు. దాదాపు 30 ఏళ్ల క్రితం నాటి కేసులో ఇప్పుడు శిక్ష పడటం కీలకంగా మారింది. ఈ మేరకు నాసిక్ కోర్పు వెలువరించింది.

- Advertisement -

అయితే నకితీ పత్రాలు(Fake Documents) సృష్టించింది, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ కోటాలో ఫ్లాట్‌లు పొందారని మాజీ మంత్రి, దివంగత టీఎస్ డిఘాలే ముప్పైఏళ్ల కిందట ఫిర్యాదు చేశారు. దాంతో కొకఠే సోదరులపై కేసు నమోదైంది. 1995లో నమోదైన ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను నాసిక్ జిల్లా సెషన్స్ కోర్టు విచారించింది. అనంతరం కోకఠే సోదరులను దోషులుగా నిర్ధారించింది శిక్ష విధించింది. ఈ సందర్బంగా మాణిక్‌రావు మాట్లాడుతూ.. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరైనట్లు తెలిపారు. ఈ తీర్పుపై మళ్ళీ అప్పీల్ చేస్తానని ఆయన(Manikrao Kokate) చెప్పారు.

Read Also: ఓటీటీలకు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kishan Reddy | ‘14 నెలల్లో రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన ఘనుడు రేవంత్’

తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని...

Revanth Reddy | రాజకీయ పావుగా పాలమూరు: రేవంత్

గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి...