Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. సోనియా గాంధీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. తనను సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కాంగ్రెస్‌ను ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని హామీఇచ్చారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. బీజేపీ విధానాలు సరిగ్గాలేవన్నారు. సోనియాగాంధీ ఎప్పుడూ పదవులను ఆశించలేదని, కాంగ్రెస్‌ని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందని Mallikarjun Kharge కొనియాడారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, మాజీ సీఎంలు, ఎంపీలు పాల్గొన్నారు. కాగా.. ఏఐసీసీ ఎన్నికల్లో సీనియర్ నేత శశిథరూర్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే.
Read also: విశాఖ రాజధాని కోసం రాజీనామాకు సిద్ధం