వన్ నేషన్ వన్ ఎలక్షన్(One Nation One Election) ఐడియాను కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, ఫెడరల్ గ్యారెంటీలకు అది విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) లేఖ రాశారు.
దేశంలో బలమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే ఈ ఆలోచనను విరమించుకోవాలని ఖర్గే సూచించారు. దీనికోసం ఉన్నతస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీ కూడా జమిలి ఎన్నికలను తాము స్వాగతించడం ఇటీవల లేదని స్పష్టం చేసింది. కాగా, వన్ నేషన్ వన్ ఎలక్షన్(One Nation One Election) పై గతేడాది సెప్టెంబర్ లో రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.