Delhi Liquor case | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు సోమవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ పాలసీలో చాలా ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారని ఈ కేసులో సిసోడియాను మరింత లోతుగా విచారించాల్సి ఉందని సీబీఐ వాదించింది. మనీష్ సిసోడియా ఒకేసారి అనేక మొబైల్ ఫోన్లను మార్చారని, నిందితులతో మాట్లాడిన సాక్ష్యాలను చెరిపి వేశారని ఆరోపించింది. లిక్కర్ పాలసీలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్స్‌లు పొందిన వారికి లబ్ధి చేకూర్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మనీష్ సిసోడియాను ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. కాగా, ఇరువైపుల వాదనలు విన్న కోర్టు మనీష్ సిసోడియా అరెస్ట్ రిమాండ్‌ను రిజర్వ్ చేస్తూ తీర్పు వెల్లడించింది.
Delhi Liquor case |మనీష్ సిసోడియాను కస్టడీకి ఇవ్వండి – సీబీఐ కోర్టు
-