Maoists kills surpanch husband at Chattisgarh: మావోయిస్టులో మరో ఘాతూకానికి తెగబడ్డారు. మహిళా సర్పంచ్ భర్తను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా రేవాలిలో జరిగింది. కౌకొండ బ్లాక్ పరిధిలోని రేవాలి పంచాయతీకి చెందిన సర్పంచ్ భర్తను శుక్రవారం మావోయిస్టులు అపహరించారు. అనంతరం పదునైన ఆయుధాలతో హతమార్చి.. మృతదేహాన్ని గ్రామంలో పడేసి పరారైనట్లు సమాచారం అందుతోంది. సర్పంచ్ భర్తను ఎందుకు చంపారో ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. కాగా ఈ హత్యలో మావోయిస్టల పాత్రపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు వెల్లడించారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మావోయిస్టులు సాధారణంగా లేఖలు విడిచిపెడతారు. కానీ ఇప్పుడు ఎటువంటి లేఖలు లభ్యం కాకపోవటంతో.. సర్పంచ్ భర్త హత్యపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.