గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో ప్రకృతి ప్రలయ తాండవం చేస్తోంది. ఒకవైపు వరదలు, మరోవైపు కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇటీవల సిమ్లా రాజాధానిలో శివాలయంపై కొండచరియలు విరిగిపడటంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మరువకముందే కులు ప్రాంతంలో ఇవాళ కొండచరియలు విరిగిపడటంతో ఏడు బహుళ అంతస్థుల భవనాలు కుప్పకూలిపోయాయి.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడడం కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందిస్తూ.. కులులో పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వాణిజ్య భవనం కుప్పకూలి పోవడానికి సంబంధించిన వీడియో తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. అధికారులు ఈ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి, ఈ భవనాన్ని రెండు రోజుల క్రితమే ఖాళీ చేయించారని వెల్లడించారు.