Dhananjay Munde | మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా

-

మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) మంత్రి పదవికి రాజీనామా చేసారు. గత ఏడాది డిసెంబర్ లో బీడ్ జిల్లాలోని మస్సాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడు ముండే అనుచరుడు వాల్మిక్ కరాడ్‌(Walmik Karad) కావడంతో అనేక రాజకీయ ఆరోపణల నేపథ్యంలో నేడు(మంగళవారం) తన రాజీనామా ను సీఎం ఫడ్నవిస్ కు అందజేశారు.

- Advertisement -

సంతోష్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి  హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యోదంతంలో ఆయన పాత్రపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం ఫడ్నవిస్ రాజీనామా చేయాలనీ ఆదేశించారు. ఈ విషయంపై సీఎం ఫడ్నవిస్(Devendra Fadnavis), డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) తో ధనంజయ్ ముండే భేటీ అయ్యారు. అనంతరం ఆయన(Dhananjay Munde) తన రాజీనామాను సీఎం కు అందజేశారు. ముండే రాజీనామాను ఆమోదించమని.. గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు ఫడ్నవీ తెలిపారు. 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని NCP చీలిపోయినప్పుడు ధనుంజయ్ ముండే అజిత్ పవార్ వెంట నడిచారు. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా సేవలందించారు.

Read Also: మామునూరు విమానాశ్రయం దగ్గర ఉద్రిక్తత
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...