మిజోరం గవర్నర్ హరిబాబు(Kambhampati Haribabu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో చికిత్స కోసం తరలించారు. ఎయిర్ అంబులెన్స్‌లో ఉండగా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు అలెర్ట్ అయ్యారు. ట్రాఫిక్ పోలీసులు కూడా అలెర్ట్ అయి.. ఆయనను ఆసుపత్రికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నిమిషాల వ్యవధిలోనే ట్రాఫిక్‌ను సవరించింది గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చేరుకున్న 30 నిమిషాల వ్యవధిలో గవర్నర్ హరిబాబును నానక్‌రామ్‌గూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు విమానాశ్రయ అధికారులు.
కాగా ప్రస్తుతం హరిబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసుపత్రికి వెళ్లి హరిబాబు(Kambhampati Haribabu)ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను ఆరా తీవారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతుందని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలన ప్రార్థించినట్లు చెప్పారు.