చంద్రయాన్‌-3 ల్యాండైన ప్రాంతానికి శివశక్తి పాయింట్‌గా నామకరణం

-

చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించి భారత ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేసిన ఇస్రో శాస్ర్తవేత్తలను ప్రధాని మోదీఅభినందించారు. విక్రమ్‌ ల్యాండర్‌ ల్యాండింగ్‌ సమయంలో సౌతాఫ్రికాలో ఉన్న మోదీ.. ఆ తర్వాత గ్రీస్‌లో పర్యటించి అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. చంద్రయాన్‌-3 ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామన్న ప్రధాని.. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్టు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్‌ – 3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా.. తన మనసంతా చంద్రయాన్‌ – 3 విజయంపైనే ఉందన్నారు. మిమ్మల్ని కలవడానికి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశానని.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు బెంగుళూరుకు వచ్చానని వెల్లడించారు.

- Advertisement -

ఇప్పుడు ఇంటింటిపైనే కాదు.. చంద్రుడిపై కూడా మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోందన్నారు. ఇప్పటివరకూ ఏ దేశం చేయలేనిది చేసి.. ప్రపంచానికి మన సత్తా చాటామన్నారు. చంద్రయాన్‌-3 ల్యాండైన ప్రాంతానికి శివశక్తి పాయింట్‌గా నామకరణం చేస్తున్నామని ప్రకటించారు. అలాగే చంద్రయాన్‌-2 దిగిన ప్రదేశానికి తిరంగా పాయింట్‌గా పేరు పెడుతున్నట్టు తెలిపారు. చంద్రయాన్‌-3 సక్సెస్‌లో మహిళా శాస్త్రవేత్తల పాత్ర ఎంతో ఉందన్న ప్రధాని.. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే చంద్రయాన్‌-3 చంద్రుడిపై అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్‌ స్పేస్‌ డేగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దామని.. ఈ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదామన్నారు మోదీ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...