రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కీలక ప్రకటన చేశారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు అంబానీ ప్రకటించారు. గ్లోబల్ ప్లేయర్‌లతో జట్టుకట్టి డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా సులభమైన, ఇంకా స్మార్ట్, లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులను అందించడానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలోకి ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న గణేశ్ చతుర్థిని పురస్కరించుని రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభించనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. వైర్ లెస్ 5జీ ఇంటర్నెట్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. జియో ఎయిర్ ఫైబర్ డివైస్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అందరికీ చేరుతుందన్నారు.