Mukesh Ambani | కన్నీళ్లు పెట్టుకున్న అపర కుబేరుడు.. ఎంతైనా తండ్రి కదా..

-

అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. దాదాపు రూ.1000కోట్లతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకల్లో దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలివచ్చారు. తొలిరోజు వేడుకల్లో అనంత్ అంబానీ ఉద్వేగంతో ప్రసంగించారు.

- Advertisement -

“నా జీవితం పూల పాన్పు కాదని మీ అందరికీ తెలుసు. బాల్యం నుంచి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. జీవిత ప్రస్థానంలో అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆ బాధను మర్చిపోయేలా చేసేందుకు నా తల్లిదండ్రులు ఎంతో శ్రమించారు, నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. నా లక్ష్య సాధనలో అనుక్షణం ప్రోత్సహించారు.. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ పెళ్లి వేడుకలను మరింత చిరస్మరణీయం చేసేందుకు తన ఫ్యామిలీ ఎంతో కష్టపడింది. నన్ను సంతోషంగా ఉంచడానికి మా అమ్మ ఎంతో తపించిపోయారు.

ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ను ఓ తీపి గుర్తుగా మలచేందుకు మా కుటుంబం గత రెండు నెలలుగా రోజుకు 3 గంటలే నిద్రపోయింది” అని అనంత్(Anant Ambani) తెలిపారు. ఆయన మాటలకు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: ఉపాసన కాళ్లకు మసాజ్ చేసిన రామ్‌చరణ్.. వీడియో వైరల్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...