‘మీరు సినిమాలు చూస్తూ పిల్లలను చదవమంటే ఎలా’

-

పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి(Narayana Murthy) కీలక సూచనలు చేశారు. విద్యావిధానంపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలు చదువుకోవడానిక ముందుగా ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలని చెప్పారు. ‘‘తల్లిదండ్రులు సినిమాలు చూస్తూ.. పిల్లలను చదువకోమని చెబితే ఎలా..? ముందు మనం పుస్తకం పట్టుకుంటే మనల్ని చూసి పిల్లలకు కూడా చదవుకోవాలన్న ఆసక్తి, ఉత్సుకత కలుగుతుంది. మా పిల్లలు అక్షతా, రోహన్ చదువుల కోసం నేను, నా సతీమణి సుధామూర్తి ప్రతి రోజూ మూడున్నర గంటలు కేటాయించేవాళ్లం. అలా కాకుండా మనం సినిమాలు చూస్తూ వాళ్లను చదువుకోమంటే వాళ్ల మనసు కూడా ఇటే ఉంటుంది కదా..’’ అని చెప్పారు నారాయణ మూర్తి. అంతేకాకుండా విద్యావిధానం అంటే ఏదో రాకెట్ సైన్స్‌లో కొందరు మాట్లాడతాని కూడా అన్నారు. విద్యా విధానం అంటే పల్లలకు నేర్చించే విధానమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -

‘‘ఎలా నేర్చుకోవాలి అనేది తెలుసుకోవడమే అసలైన విద్యావిధానం. ముందు దేన్నైనా పరిశీలించాలి. ఆ తర్వాత దాన్ని విశ్లేషించాలి. ఆ తర్వాత దాన్ని అన్వయించుకోవాలి. చివరకు ఫలితాన్ని ధ్రువీకరించుకోవాలి. ఇదే అసలైన విద్య ప్రాముఖ్యత. అలా కాకుండా సమస్యను అర్థం చేసుకోకుండా, పరిశీలించకుండా, పరిష్కరించడానికి ప్రయత్నించకుండా.. దాన్ని వివరించకుండా పుస్తకం చేతికిచ్చి చదమనడం విద్య నేర్పించడం కాదు. రుద్దడం అవుతుంది’’ అని Narayana Murthy వివరించారు.

Read Also: ‘వాటిపై నాకు నమ్మకం లేదు’.. కోచింగ్ క్లాసులపై నారాయణ మూర్తి
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...