బీహార్ సీఎం నీతీష్ కుమార్(Nitish Kumar)కు పెను ప్రమాదం తప్పింది.ఇవాళ ఉదయం ఆయన మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఓ యువకుడు బైక్‌పై వచ్చి ఢీకొట్టబోయాడు. దీంతో నితీశ్(Nitish Kumar) వెంటనే అప్రమత్తమై ఫుట్ పాత్ మీదకు దూకడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించడంతో సీఎం అధికారిక నివాసంలో అధికారులు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం భద్రతలో(CM Security) వైఫల్యం గురించి తీవ్రంగా చర్చించారు. బైక్‌పై దూసుకొచ్చిన యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని యువకుడు బైక్‌పై కుట్రపూరితంగా వచ్చాడా? పొరపాటున వచ్చాడా? అనేది తెలియాల్సి ఉందన్నారు. నిందితుడు ఓ యూట్యూబర్(Youtuber) అని తెలుస్తోంది. బైక్‌పై స్టంట్లు చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ పోస్టు చేస్తాడని ఓ అధికారి తెలిపారు. ఫాలోయింగ్ కోసమే అతడు ఈ పని చేశాడా? మరేదైనా కారణం ఉందా? విచారణలో తేలుతుందని వెల్లడించారు.
బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
- Advertisement -