అగ్రరాజ్యం అమెరికాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. సుంకాల తగ్గింపుకు సంబంధించి కానీ, మరే ఇతర అంశంలో కానీ అమెరికాకు భారత్ ఎటువంటి హామీ ఇవ్వలేదని ఇండియా క్లారిటీ ఇచ్చింది. సుంకాల తగ్గింపుకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) చేసిన వ్యాఖ్యలకు భారత్ ఇలా స్పందించింది. ఈ విషయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. తీవ్ర చర్చలకు దారితీస్తోంది. భారత్ ఎటువంటి హామీ ఇవ్వకుంటే ట్రంప్ ఎందుకు అలా స్పందిచారన్న అనుమానాలు కలుగుున్నాయి.
అయితే అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్(Donald Trump).. తనామన అన్న తేడా లేకుండా పన్నుల మోతమోగిస్తున్నారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించిన ట్రంప్.. వచ్చే నెల రెండో తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇటీవల ఇదే అంశంపై మరోసారి స్పందించిన ట్రంప్.. భారత్ అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోందని, ఆ దేశంలో ఏ వస్తువు విక్రయించడానికి వీలులేనంతగా పన్నులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం, భారత్ చర్యలను బహిర్గతం చేయడం వల్ల పన్నులు తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందని ఆయన వివరించారు. దీనిపై స్పందిస్తూనే భారత్.. తాము ఎటువంటి హామీ ఇవ్వలేదని చెప్పింది.