లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలనే పిటిషన్‌పై విచారణ జరిగింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే దీనిపై ఏప్రిల్ 2లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.
కాగా లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చగా మార్చి 28వరకు కస్టడీ విధించారు. అప్పటి నుంచి ఆయన ఈడీ కార్యాలయం నుంచే పరిపాలన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం బాగాలేదని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోయాయని.. తక్షణమే ఆయన(Arvind Kejriwal)కు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.