‘వికసిత్ భారత్(Viksit Bharat)’ లక్ష్యాన్ని సాధించే వరకు విరామం లేదు.. విశ్రమించేదీ లేదంటూ ప్రధాని మోదీ(PM Modi) హామీ ఇచ్చారు. ఈ లక్ష్యసాధనకైనా అలుపులేకుండా పని చేస్తానని, ప్రతి అడుగులో మరింత ముందుకెళ్తానని ఆయన అన్నారు. సోమవారంతో ప్రభుత్వాధినేతగా ఆయన 23 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన లక్ష్యాన్ని తన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్‌ల రూపాన వెల్లడించారు. ‘‘7 అక్టోబర్ 2001లో నేను తొలిసారి గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాను. కచ్ భూకంపం, కరువు, సూపర్ సైక్లోన్, దశాబ్దాల కాంగ్రెస్ లూటీ పాలన, కులతత్వం, మతతత్వం వంటి ఎన్నో సవాళ్లను ఎదర్కొన్న తర్వాత గుజరాత్ పునఃనిర్మాణ కలను నెరవేర్చుకున్నాం. అభివృద్ధిలో ఉన్న శిఖరాలను అందుకుందాం. వ్యవసాయంలో కూడా విజయం సాధించాం’’ అని వెల్లడించారు.
Viksit Bharat | ‘‘2014లో భారతదేశ ప్రజలకు భారీ మెజార్టీతో బీజేపీకి పట్టం కట్టారు. 30ఏళ్లలో ఎన్నడూ లేని మెజార్టీ సాధించడం లక్ష్య సాధనలో తొలి మెట్టు ఎక్కడమే. అప్పుడే నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టాను. దశాబ్దకాలంలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లను పరిస్కరించాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేశాం. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ఆయుధ తయారీ, రవాణాలో కూడా ఇటీవలే జపాన్‌ను అధిగమించాం. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే వరకు అలుపెరగక పనిచేస్తాం. భారత్ సాధిస్తున్న విజయాలను ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది’’ అని ఆయన రాసుకొచ్చారు.