మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..

-

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఒడిశా(Odisha)లోని బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పాలసీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు వర్తిస్తుందని వెల్లడించింది. కటక్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఒడిశా ఉప ముఖ్యమంత్రి పార్వతి పరీదా ప్రకటించారు. ఈ పాలసీని తక్షణం అమలవుతుందని తెలిపారు. మహిళా ఉద్యోగులు తమ రుతుక్రమం(Menstrual Leaves) సమయంలో తొలి ఒకటి లేదా రెండో రోజు సెలవు తీసుకునేలా నిబంధనలు రూపొందించామని చెప్పారు. మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

- Advertisement -

రుతు క్రమం సమయంలో మహిళలకు సెలవు కేటాయించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ సమయంలో ఒడిశా(Odisha) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నెలలో మూడు రోజుల నెలసరి సెలవులు ఇవ్వాలంటూ 2022లో ఓ బిల్లును ప్రతిపాదించినప్పటికీ దానికి ఆమోదం లభించలేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళలకు ఈ నెలసరి సెలవులు ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాల్లో చేరడానికి ప్రోత్సాహం అందించినట్లవుతుంది. కానీ దీనిని అమలు చేయాలని సంస్థల యాజమాన్యాలను ఒత్తిడి తెస్తే వ్యతిరేకత రావచ్చు. అలాంటప్పుడు మహిళలకు ఉద్యోగావకాశాలు తగ్గొచ్చు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Read Also: అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన బాబు..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...