భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సూర్యుడిపై పరిశోధనకు సిద్ధమైంది. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీన సూర్యుడి మీదకు ఆదిత్య ఎల్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఆదివారం ఉదయం 11:50 గంటలకు తిరుపతిలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. కాగా, ఇటీవలే చందమామపై ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నెక్ట్స్ టార్గెట్ సూర్యుడే అని స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు సూర్య మండలంపై పరిశోధన కోసం ఆదిత్య ఎల్-1ను ప్రయోగించిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది.