కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా బెంగళూరులో విపక్షాల కూటమి(Opposition Meet) సమావేశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వహించిన ఈ కూటమిలో దాదాపు 26 పార్టీలు పాల్గొన్నారు. ఢిల్లీలో కూటమి కోసం ఒక కామన్ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే, 11 మంది సభ్యులతో ఒక సమన్వయ కమిటీని నియమించాలని నిర్ణయించారు. కూటమి పేరును ‘ఇండియా’(‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్ క్లూజివ్ అలయన్స్)గా మార్చారు.
Opposition Meet | అనంతరం నెక్ట్స్ మీటింగ్‌ను ముంబైలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆ భేటీ ఎప్పుడు జరపనున్నది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను కూడా ముంబై సమావేశంలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. 2024లో బీజేపీని ఓడించడం లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయన్నారు.
Read Also: పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat