Betting Apps | దేశంలో ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టడంలో గణనీయమైన మెరుగుదల ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో వెల్లడించారు. 2024లో 1,000 కంటే ఎక్కువ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్ లను నిషేధించామని ఆయన తెలిపారు. ఇటువంటి కార్యకలాపాలను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం రెండూ కలిసి పనిచేయాలని సూచించారు.
బుధవారం పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ అనుబంధ ప్రశ్నలకు మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ… కేంద్ర ప్రభుత్వం ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భాలు దృష్టికి వచ్చినప్పుడల్లా, రాజ్యాంగ పరిధిలోనే చర్యలు తీసుకుంటామని మంత్రి నొక్కి చెప్పారు. ఆన్‌లైన్ జూదం కార్యకలాపాలు, హింసాత్మక ఆన్‌లైన్ గేమ్ లు యువతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని వివిధ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వైష్ణవ్ మాట్లాడుతూ… 2024లో 1,097 బెట్టింగ్, జూదం వెబ్‌సైట్ లను(Betting Apps) నిషేధించామన్నారు. సైబర్ సంబంధిత నేరాలను నిర్వహించే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయంతో, అటువంటి కార్యకలాపాలను ఎదుర్కోవడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. వీటిని అరికట్టేందుకు బలమైన చట్టపరమైన చర్యలను రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.
Read Also: స్పైసీగా తినాలనిపిస్తోందా.. సింధీ ఆలూ తుక్ ట్రై చేయండి..