Chenab Rail Bridge | జమ్మూకశ్మీర్‌లోని చినాబ్ నదిపై భారత్ నిర్మించిన వంతెనకు ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ఈ బ్రిడ్స్ రికార్డులకెక్కింది. ఇప్పుడు ఈ వంతెనపై మన దాయాది పాకిస్థాన్ కన్ను పడిందని ఇంటెలిజెన్స్ నివేదికలు ఘోషిస్తున్నాయి. ఇదంతా కూడా చైనా కోరిక తీర్చడం కోసమేనని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లె చెప్తున్నాయట. జమ్మూకశ్మీర్‌లోని రైసీ, రామబాణ్ జిల్లాల మధ్య ఉన్న ఈ వంతెనకు సంబంధించిన వివరాలు సేకరించమని చైనా ఆదేశించడంతోనే పాక్ వాటిని శిసావహిస్తోందని, పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు చినాబ్ నదిపై ఉన్న వంతెనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ప్రయతనాలు ముమ్మరం చేశాయని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయట. కానీ ఉన్నట్లుండి చైనా.. ఈ వంతెన వివరాలు ఎందుకు అడిగింది? అనేది మాత్రం ఇంకా కోటిరూపాయల ప్రశ్నగానే మిగిలుంది.
20ఏళ్ల కష్టం ఈ వంతెన
జమ్మూకశ్మీర్‌లోని చినాబ్ నదిపై ఈ వంతెన నిర్మించడానికి భారత ప్రభుత్వానికి 20 సంవత్సరాలు సమయం పట్టింది. ఇటీవలే దీనిపై తొలి ట్రయల్ రన్ రైలును కూడా నడిపారు. ఈ వంతెన కశ్మీర్‌ను భారత్‌లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడం కోసం ఈ వంతెనను నిర్మించడం జరిగింది. దీనిని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్(USBRL) ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించారు. ఇంతకాలం చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 అడుగుల పొడవైన వంతెన ప్రపంచంలోని అతి ఎత్తైనా వంతెనగా ఉండేది. కానీ ఆ రికార్డ్‌ను భారత్ చినాబ్ వంతెన(Chenab Rail Bridge) నిర్మించి లాగేసుకుంది.