Parliament Winter Session | శీతాకాల సమావేశాలకు డేట్ ఫిక్స్.. ప్రకటించిన కేంద్రమంత్రి

-

Parliament Winter Session | పార్లమెంటు శీతాకాల సమావేశాలకు డేట్ ఫిక్స్ అయినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాలను నవంబర్ 25 ప్రారంభించాలని నిర్ణయించిట్లు వెల్లడించారు. ఈ సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయని, ఈ సమావేశాల్లో భాగంగానే నవంబర్ 26న రాజ్యంగ దినోత్సవాన్ని నిర్వహిస్తామని మంత్రి రిజిజు తెలిపారు. ఈ రాజ్యంగ దినోత్సవ వేడుకకు సంవిధాన్ సదన్(పార్లమెంటు పాత భవనం) వేదిక కానున్నట్లు కూడా రిజిజు చెప్పారు.

- Advertisement -

Parliament Winter Session | మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ప్రతి పార్టీ కూడా ప్రస్తుతం ఈ ఎన్నికలపైనే ఫుల్ ఫోకస్ పెట్టి ఉన్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజ్ం సాధించాలని కసరత్తులు చేస్తున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయి నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి. ఫలితాలు వచ్చిన రెండు రోజులకే పార్లమెంటరీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటిలో వక్ఫ్ బిల్లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత సెషన్‌లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం ఒక అడుగు వెనక్కేసింది. అంతేకాకుండా ఈ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది.

Read Also:  ‘ఆటో వాళ్ల సత్తా నాకు తెలుసు’.. మహాధర్నాలో కేటీఆర్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...