పార్లమెంటు శీతాకాల సమావేశాలు(Parliament Winter Session) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రాజ్‌నాథ్(Rajnath Singh) అధ్యక్షతన జరిగిన ఈ భేటిలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అత్యంత రసవత్తరంగా సాగింది. అదానీ(Adani)పై వచ్చిన లంచం ఆరోపణలు, మనిపూర్‌లోని హింసాత్మక పరిస్థితులు వంటి కీలక అంశాలపై ఈ శీతాకాల సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ వెల్లడించారు. దాంతో పాటుగా దేశంలో పెరుగుతున్న కాలుష్యం, రైలు ప్రమాదాలపై కూడా చర్చించాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు(Parliament Winter Session) నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న సమావేశాలు జరగవు. పార్లమెంటు పాత భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇది ఉంటే ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ నెల 29న వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ తన నివేదికను అందించే అవకాశాలు ఉన్నాయి. ఆ నివేదిక వస్తే దానిపైన కూడా పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.