Tamil Nadu | మరోసారి తమిళనాడును ముంచెత్తిన భారీ వరదలు

-

దక్షిణ తమిళనాడు(Tamil Nadu)లో వర్షాలు దంచి కురుస్తున్నాయి. ఆదివారం నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మొత్తం నాలుగు జిల్లాలను వరద ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుండపోతగా వర్షం కురుస్తుండడంతో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. ఊర్లు ఏరులై పారుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో పలు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు నిలిచిపోయారు.

- Advertisement -

Tamil Nadu | కొన్నిచోట్ల వరద నివాస ప్రాంతాలను చుట్టుముట్టింది. దీంతో ఏది రోడ్డో ఏది చెరువో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. కొన్ని చోట్ల కరెంటు తీగలు తెగి పడడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సహాయక చర్యల కోసం 250 SDRF బృందాలను రంగంలోకి దించింది ప్రభుత్వం. తూత్తుకుడి జిల్లాలోని కాయిలపట్టణంలో 24 గంటల్లో ఏకంగా 95 సెంటీమీటర్ల కురిసింది. నీలగిరి జిల్లా(Nilgiris District)లో కొండ చరియలు విరిగి పడడంతో ట్రాఫిక్ కి భారీ అంతరాయం కలిగింది. రెడ్ అలర్ట్ ఉన్న నాలుగు జిల్లాల్లో 84 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో 24 గంటల పాటు వరద ముప్పు ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకి రావద్దని హెచ్చరిస్తున్నారు.

Read Also: ప్రభుత్వ పాలనపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...