ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ(PM Modi) దృష్టి సారించారు. అందులో భాగంగా రేపు హస్తినలో మోడీ పర్యటించనున్నారు. ఢిల్లీలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అశోక్ విహార్ లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్ లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కొత్తగా నిర్మించిన 1,675 ఫ్లాట్లను ఆయన ప్రారంభించనున్నారు.
నౌరోజీ నగర్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్ లో GPRE టైప్ 2 క్వార్టర్స్ ప్రాజెక్టులు ఓపెన్ చేయనున్నారు. ద్వారక లో CBSE ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ని ప్రారంభిస్తారు. నజబ్ గడ్ రోషన్ పురా లోని వీర్ సావర్కర్ కళాశాలకు మోడీ(PM Modi) శంకుస్థాపన చేయనున్నారు.
కాగా, 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్(AAP) వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా ఆప్ ని ఓడించి హస్తిన లో జెండా ఎగురవేయాలని బీజేపీ(BJP) భావిస్తోంది. అందుకోసం వ్యూహ రచన చేస్తోంది. అయితే ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్(Kejriwal) పై ఉన్న అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని కాషాయ దళం భావిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ తనపై కుట్ర పూరితంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారని సానుభూతి ఓట్లు గెలిచే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో దేశ రాజధానిలో ఎన్నికలు ఉత్కంఠగా మారాయి.
Read Also: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… రైతు భరోసా ఎప్పుడంటే..
Follow US: Google News, Twitter, Share Chat