దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ మహిళా దినోత్సవ కానుక అందించారు. వంటగ్యాస్ ధర(Gas Cylinder Price)ను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. “మహిళా దినోత్సవ సందర్భంగా మా ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. వంట గ్యాస్‌ను మరింత అందుబాటులోకి చేయడం ద్వారా పేద ప్రజల కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ట్వీట్ చేశారు.
గతేడాది రాఖీ పండుగ సందర్భంగా సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు(Gas Cylinder Price) ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 955 ఉండగా.. ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 903.. ముంబైలో సిలిండర్ ధర రూ.902 ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో హైదరాబాద్‌లో రూ.100 తగ్గి రూ.855కి చేరుకుంది. మోదీ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న రూ.300 సబ్సిడీని కూడా మార్చి 31, 2025 వరకు పొడిగించారు.