పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖారారైంది. ఈ మేరకు షెడ్యూల్‌ను పీఎంవో అధికారులు ప్రకటించారు. మార్చి మొదటి వారంలో రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. అలాగే రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో ఎక్కువ స్థానాలు గెలిచేలా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
షెడ్యూల్ ఇదే..
మార్చి4వ తేదీ ఉదయం 9:20 నిమిషాలకు ప్రత్యేక విమానంలో నాగపూర్ చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 10.20 నిమిషాలకు ఆదిలాబాద్‌కు వస్తారు.
ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 11.05 నుండి 12.00 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తమిళనాడు పర్యటనకు వెళ్తారు.
రాత్రి 7.45 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
రాత్రి 8.00 గంటలకు రాజ్ భవన్‌కు చేరుకొని అక్కడే బస చేస్తారు.
మార్చి 5వ తేదీ పర్యటన వివరాలు..
ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలుదేరి.. బేగంపేట విమానాశ్రయంకు వెళ్తారు.
10:40 నిమిషాలకు సంగారెడ్డికి చేరుకుంటారు.
10:45 నుండి 11:15 నిమిషాల వరకు అధికారికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు పూర్తై ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.
ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12: 45 నిమిషాల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
సంగారెడ్డి బహిరంగ సభ అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ఒడిశాకు వెళ్లనున్నారు.