Lok Sabha Election | బీహార్ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టనున్నారు. చంపారన్ లో ఆయన తొలి బహిరంగ సభ జరగనుంది. బేతియా సిటీలోని రామ్ మైదాన్ లో జనవరి 13 న మొదటి ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ సమర శంఖం మోగించనున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా బీహార్ లోని పలు అభవృద్ధి కార్యక్రమాలకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు.
Lok Sabha Election | కాగా, బీహార్ లోని 40 పార్లమెంటు సెగ్మెంట్లను కైవసం చేసుకోవడానికి బీజేపీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో జనవరి నుంచి పార్టీ పెద్దలు బీహార్ లో పలు ప్రచార కార్యక్రమాల్లో హాజరు కానున్నారు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు హోం మంత్రి అమిత్ షా(Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) వివిధ ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ(PM Modi) తన తొలి ప్రచార పర్యటనలో భాగంగా బెగుసరాయ్, బెట్టాయ్, ఔరంగాబాద్ ర్యాలీల్లో పాల్గొంటారు. అమిత్ షా జనవరి-ఫిబ్రవరిలో సీతామర్హి, మథేపుర, నలందలో జరిగే ర్యాలీల్లో పాల్గొననున్నారు. జేపీ నడ్డా ప్రధానంగా సీమాంచల్, బీహార్ ఈస్ట్ రీజియన్లలోనూ ప్రచారం చేయనున్నారు. పోయిన లోక్ సభ ఎన్నికల్లో బీహార్ నుంచి ఎన్డీయే 39 సీట్లు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి 40 స్థానాల్లో గెలవాలని బీజేపీ పథకాలు రచిస్తోంది.