PM Modi | తమిళనాడు నుంచి ప్రధాని మోడీ పోటీ.. నియోజకవర్గం ఇదే!

-

ఎన్నికలు సమీపిస్తు్న్న వేళ బీజేపీ దూకుడు పెంచింది. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో గట్టి పాగా వేయాలని యోచిస్తున్న బీజేపీ.. ఆ మేరకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ(PM Modi)ని తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం రామేశ్వరం(Rameshwaram) నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తమిళ పత్రికలో ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.

- Advertisement -

తమిళనాడు బీజేపీ వర్గాలు సైతం దీనిపై తమకు స్పష్టమైన సంకేతాలు అందినట్లు చెబుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా ఈ అంశం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో వారాణసీ(Varanasi) నుంచి పోటీ చేసిన మోడీ.. ఈసారి కాశీ(Kashi)తోపాటు రామేశ్వరంలోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. స్వయంగా ప్రధానే ఇక్కడి నుంచి పోటీ చేస్తే, ఆ ప్రభావం ఓటర్లపై పడటంతోపాటు, తమ పార్టీ అభ్యర్థుల్లోనూ ఉత్సాహం కలుగుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మోడీ రెండు చోట్లా విజయం సాధించడం ఖాయమని ఆ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం వారాణసీ నియోజకవర్గానికి మోడీ(PM Modi) రాజీనామా చేస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Read Also: గంగా నదిని క్లీన్ చేయనున్న తాబేళ్లు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...