Flash: ప్రధాని మోదీ తమ్ముడి కుటుంబానికి రోడ్డు ప్రమాదం 

-

PM Modi’s brother Prahlad Modi, family injured in road accident near Mysuru: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరు నుంచి చామరాజనగర్ బండిపురాకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రహ్లాద్ మోదీ తన భార్య, కొడుకు, కోడలు, మనవడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే మైసూరు డిప్యూటీ కమిషనర్ సీమా లత్కర్ ఆసుపత్రికి చేరుకున్నారు. వారి క్షేమ సమాచారం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రహ్లాద్ మోదీ(Prahlad Modi), ఆయన కుమారుడు మెహుల్ మోదీ, కోడలు జిందాల్ మోదీ, మనవడు మెహత్, కారు డ్రైవర్ సత్యనారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: బ్రా, జాకెట్ విప్పేసి అందాలు ఆరబోసిన బ్యూటీ (వీడియో)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...