కేంద్రం కొత్త పథకం.. వారికి రూ.3లక్షల రుణం

-

దేశంలోని చేతి వృత్తుల వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం విశ్వకర్మ యోజన(PM Vishwakarma Yojana) పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి కేంద్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఈ లోన్ పై వడ్డీ కూడా కేవలం 5 శాతం మాత్రమే ఉండనుంది. విశ్వకర్మ యోజన స్కీమ్ కింద దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం కింద సబ్సిడీ వడ్డీ రేటుతో తొలిసారి రూ. 1 లక్ష లోన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత రెండో విడతలో రూ. 2 లక్షల వరకు రుణం అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటు కేవలం 5 శాతంగానే ఉంటుంది. అంటే ఇది చాలా తక్కువ వడ్డీ రేటు అని చెప్పవచ్చు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఎర్రకోట నుంచి ప్రకటించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ స్కీమ్‌కు ఆమోదం తెలిపారు.

- Advertisement -

సెప్టెంబర్‌ 17న విశ్వకర్మ యోజన స్కీమ్‌ ప్రారంభంకానుంది. 18 సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఈ పథకం కింద రుణాలు అందించనున్నారు. చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కోసం రూ. 13 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపింది కేంద్రం. ఈ శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ. 500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత పరికరాల కొనుగోలుకు రూ.15వేల ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. చర్మకారులు, మేస్త్రీలు, స్వర్ణకారులు, టైలర్లు, పనిముట్లను తయారు చేసే కమ్మరివారు, శిల్పి, వడ్రంగి పనివారు, పడవల తయారీదారులు, బ్లాక్‌స్మిత్, లాక్‌స్మిత్, గోల్డ్‌స్మిత్, కుండల తయారీదారులు, శిల్పులు తదితరులు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు.

సంప్రదాయ పనులు చేసే వారు ఆర్థికంగా బలోపేతం అవ్వడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకం తీసుకువచ్చింది. . ఈ పథకం ద్వారా, శిక్షణ అందించడం, ఆధునిక పద్ధతుల గురించి సమాచారం, బ్రాండ్ ప్రమోషన్, స్థానిక, ప్రపంచ మార్కెట్‌లతో అనుబంధం పెంచడం, డిజిటల్ చెల్లింపులు వంటివి చేయనున్నారు, దేశంలోని ప్రతి మూలలో విశ్వకర్మ సంస్థాగత మద్దతును ప్రభుత్వం అందించనుంది.

Read Also: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. హీత్ స్ట్రీక్ బతికే ఉన్నారు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...