రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎక్కడంటే..

-

భారతదేశ పోలీసు శాఖ మాదక ద్రవ్యాలపై కన్నెర్ర చేస్తోంది. ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాల వినియోగాన్ని, విక్రయాలను, సరఫరాలను నిరోధిస్తోంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు అధికారులు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాజధాని భోపాల్‌లోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్‌తో పాటు ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయాన్ని గుజరాత్ హోంశాఖ సహాయక మంత్రి హర్ష సంఘవి వెల్లడించారు. భోపాల్‌లోని ఓ ఫ్యాక్టరీలో మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు సోదాలు చేశారని, ఈ తనిఖీల్లో గుజరాత్ ఏటీఎస్, ఢిల్లీ ఎన్‌సీబీ సంయుక్తంగా పాల్గొన్నాయి. ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.1800 కోట్లు వరకు ఉండొచ్చని సమాచారం. డ్రగ్స్‌తో పాటుగా మరింత ముడిసరుకును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

- Advertisement -

Madhya Pradesh | ‘‘ఏటీఎస్, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఆరోగ్యకర సమాజం కోసం అధికారులు ఎంతో శ్రమిస్తున్నారు. భారత్‌ను డ్రగ్స్ ఫ్రీగా తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఆరోగ్యకర సమాజం నిర్మాణమే మా కల. ఆ లక్ష్య సాధనకై అధికారులు ఎంతో శ్రమిస్తున్నారు. భారత్‌ను డ్రగ్స్ భూతం నుంచి విడిపించడానికి నిర్విరామంగా శ్రమిస్తాం’’ అని సహాయక మంత్రి హర్ష సంఘవి తన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొన్నారు.

Read Also: సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...