విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు వారి అభిమాన నటుడు, నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆవిష్కరించారు. ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఉదయం 10గంటలకు రూ.100 నాణెం(NTR 100 Rupees Coin) ఆవిష్కరణ వేడుక జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ నాణెం పై మార్చి 20వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ తో రూపొందించారు.
నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20నిమిషాల షార్ట్ ఫిల్మ్ ని ప్రదర్శించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. రాజకీయాల్లో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన ఎంతో పాడుపడ్డారని తెలిపారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ రాణించారని, రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఆయన నటన ఎంతో అద్భుతమని కొనియాడారు.
NTR 100 Rupees Coin | ఈ కార్యక్రమానికి ముందు ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari) మాట్లాడుతూ.. మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఎన్టీఆర్ కేవలం ఒక తరానికే పరిమితమైన హీరో కాదని, అన్ని తరాలకు ఆదర్శ హీరో అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు. జేపీ నడ్డా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చం ద్రబాబు నాయుడు, ప్రముఖనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
President Droupadi Murmu released the commemorative coin on Late Shri NT Rama Rao on his centenary year at RBCC. The President said that Late Shri NT Rama Rao has enriched Indian cinema and culture through Telugu films. NTR’s popularity was equally wide as a public servant and… pic.twitter.com/GeF2C3n0dE
— President of India (@rashtrapatibhvn) August 28, 2023