ఇస్రో ఈరోజు చేసిన PSLV C59 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట(Sriharikota)లోని సతీష్ ధవనో స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 4:04 గంటలకు భూకక్ష్యలో ప్రవేశించింది. దీంతో ఈ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ విజయంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్(Somanath), శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
ప్రోబా-3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని చెప్పారు. ఈ సందర్బంగా ప్రోబా రానున్న కాలంలో చేపట్టే ప్రయోగాలకు కూడా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఎన్ఎస్ఐఎస్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టినట్లు ఆయన తెలిపార.
ఐరోపా అంతరిక్ష సంస్థ(ESA)కు చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్నచిన్న ఉపగ్రహాలను కూడా PSLV C59 అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఇందులో ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. వాటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు వీటి ఉద్దేశం. ఇందుకోసం అవి పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్దతిలో భూకక్ష్యలో సంచరిస్తాయి. ఇటువంటి ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే తొలిసారి అని ఈఎస్ఏ పేర్కొంది.