Arvind Kejriwal: గుజరాత్, హరియాణా ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై గాంధీతోపాటు లక్ష్మీదేవి, వినాయక స్వామి ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇండోనేషియా లాంటి ముస్లిం దేశంలో నోట్లపై గణేశుని ఫోటోను ముద్రించారని గుర్తుచేస్తూ.. మన ప్రభుత్వం కూడా కొత్తగా ముద్రించే నోట్లపై ఈ బొమ్మలు ముద్రించాలని కోరారు. ఈ దేవతల ఫోటోలు కరెన్సీ నోట్లపై ఉండటం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోని వ్యాపారస్తులంతా రోజూ తమ పని మొదలు పెట్టే ముందు లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేస్తారని తెలిపారు. దీనిపై రెండు రోజుల్లో ప్రధానికి లేఖ రాస్తాననిArvind Kejriwal అన్నారు.
- Advertisement -
Read also: కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన ఖర్గే