మావోయిస్టు తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉక్కుపాదం మోపాలని, దేశంలోనే ఇది లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు తీవ్రవాదం తుదిదశకు చేరుకుందని, దీని ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టిందని ఆయన వెల్లడించారు. అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు జరిగింది. అందులో అమిత్ షా మాట్లాడుతూ.. మావోయిస్టు తీవ్రవాదానికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు. ‘‘కేంద్రం చర్యలతో దేశంలో ఇప్పటి వరకు 13 వేల మంది మావోయిస్టులు ఆయుధం వదిలారు. 2024లో ఇప్పటి వరకు 202 మంది ప్రాణాలు విడిచారు. 723 మంది లొంగిపోయారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో లక్ష్యసాధనకై ముందుకెళ్లాలి. ఛత్తీస్‌గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. అక్కడ కూడా కొందరు మావోలు లొంగిపోయారు’’ అని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో హింసాత్మక ఘటనలకు తగ్గాయని, ఈ ఫీట్ సాధించినందుకు డీజీపీకి అభినందనలు అంటూ అమిత్ షా ప్రశంసించారు. ‘‘పదేళ్లలో 11,500 కిలోమీటర్ల మేర రోడ్ నెట్వర్క్‌తో పాటు 15,300 సెల్ టవర్లు ఏర్పాటు చేశాం. గతంలో హింసాత్మక ఘటనలు 16,400పైగా జరిగాయి. ప్రస్తుతం ఇవి రూ.7,700కు పరిమితం అయ్యాయి. వీటిని 0కు తీసుకురావడం లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నాం’’ అని ఆయన(Amit shah) అన్నారు.