కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆదివారం రాత్రి కన్నింగ్‌హామ్ రోడ్‌లోని కేఫ్ కాఫీ డే అవుట్‌లెట్‌లో బస చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ఉదయాన్నే BMTC బస్సులో ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలతో ముచ్చటించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, గృహలక్ష్మి పథకం, బీఎమ్‌టీసీ(BMTC), కేఎస్‌ఆర్‌టీసీ(KSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వంటి కాంగ్రెస్ హామీలను వారికి వివరించారు. అలాగే కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లోనూ ప్రయాణం చేశారు. గృహలక్ష్మి పథకం రూ.2 వేలు ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రవాణా సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి కొందరు మహిళలు తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ.. తాము అధికారంలో ప్రత్యేక బడ్జెట్ పెడతామని హామీ ఇచ్చారు. ఇక లింగరాజపురంలో బస్సు దిగిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. అక్కడ బస్టాప్ వద్ద ఉన్న మహిళలతోనూ మాట్లాRahul Gandhi boards BMTC bus in Bengaluruడారు.
Read Also: కేరళ బోటు ప్రమాదంలో తీవ్ర విషాదం.. 22కు పెరిగిన మృతుల సంఖ్య
Follow us on: Google News, Koo, Twitter