నా దారి రహదారి.. రాహుల్ గాంధీ ట్వీట్ వైరల్

-

‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు అనంతరం రాహుల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తన దారిలో అడ్డంకులు ఎన్ని వచ్చినా.. తన కర్తవ్యం ఎప్పటికీ మారదని.. ఇండియా ఐడియాలజీని రక్షించడమే తన ధ్యేయమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇవాళ కాకుంటే రేపు అయినా న్యాయం గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఏం జరిగినా నా దారి క్లియర్‌గా ఉందని.. తానేం చేయాలనే అంశంపై తనకు పూర్తి స్పష్టత ఉందన్నారు. తనకు మద్దతు తెలిపిన వారికి, ప్రేమ చూపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ తీర్పుపై స్పందించారు. ఎట్టకేలకు న్యాయం జరిగిందని ప్రజాస్వామ్యం నెగ్గిందన్నారు. ఇకనైనా విపక్షాలను లక్ష్యంగా చేసుకునే దుర్మార్గపు ఆలోచనలను బీజేపీ ఆపేయాలని సూచించారు. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించడంతో రాహుల్‌ ఎంపీ సభ్యత్వంపై పడిన అనర్హత వేటు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. దీంతో ఆయన ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మళ్లీ పాల్గొనవచ్చు.

2019లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందనని చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాహుల్‌ను దోషిగా గుర్తిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. సూరత్ కోర్టు తీర్పుపై హైకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించినా అక్కడ కూడా ఊరట దక్కలేదు. చివరగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ కేసులో ఇరు పక్షాల విదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...