Rahul Gandhi – Priyanka Gandhi | మే 20 న అమేథీ, రాయ్ బరేలీ లలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దీంతో ఈ రెండు స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోటలైన అమేథీ, రాయ్ బరేలి పార్లమెంటు అభ్యర్థులపై నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఏ క్షణంలోనైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ఈ రెండు స్థానాల్లో పోటీకి రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ సుముఖంగా ఉన్నారు. యూపీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కూడా ఈ రెండు స్థానాల నుంచి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.